News February 11, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

image

AP: తూ.గో జిల్లా కానూరులో కోళ్లకు <<15420742>>బర్డ్‌ఫ్లూ<<>> నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు భారీగా పడిపోయింది. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. అయినా సరే ప్రజలు చికెన్ కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Similar News

News November 23, 2025

చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

image

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్‌లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.

News November 23, 2025

రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

image

<<18323509>>ఎన్‌కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.

News November 23, 2025

సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

image

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.