News February 11, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

AP: తూ.గో జిల్లా కానూరులో కోళ్లకు <<15420742>>బర్డ్‌ఫ్లూ<<>> నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు భారీగా పడిపోయింది. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. అయినా సరే ప్రజలు చికెన్ కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Similar News
News July 9, 2025
APలో భారీ పెట్టుబడి: TDP

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.
News July 9, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News July 9, 2025
MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.