News February 20, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రూ.500 కోట్ల నష్టం!

image

TG: బర్డ్ ఫ్లూ వైరస్‌తో ఫౌల్ట్రీ పరిశ్రమపై పెద్ద దెబ్బ పడింది. కోళ్ల మృత్యువాత, ప్రజలు చికెన్, గుడ్లు తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో రోజుకు రూ.15+ కోట్ల చొప్పున నెలలో రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 26, 2025

కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

AP: మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల సమయంలో గుండెలోనూ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
(Article being continuously updated..)

News March 26, 2025

జిన్‌పింగ్ కుటుంబీకుల వద్ద భారీగా అవినీతి ఆస్తులు!

image

దేశంలో అవినీతిని వేటాడుతున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతుంటారు. కానీ వారి కుటుంబమే రూ.కోటానుకోట్లు వెనకేసిందని రేడియో ఫ్రీ ఏషియా నివేదిక తెలిపింది. ‘2012లో అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి జిన్‌పింగ్ అవినీతి నిరోధక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీలోని వేలాదిమందిని అరెస్ట్ చేశారు. అయితే తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల్లో జిన్‌పింగ్ కుటుంబం భారీగా కూడబెట్టింది’ అని వెల్లడించింది.

News March 26, 2025

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

error: Content is protected !!