News July 29, 2024
భారత పౌరవిమానయాన పితామహుడి జయంతి
ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా అలియాస్ జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా జయంతి నేడు. 1904లో ఇదేరోజు పారిస్‌లో జన్మించిన ఆయన 1929లో ఇండియాలో మొట్టమొదటి పైలట్ లైసెన్సును పొందారు. 1932లో మొదటి వాణిజ్య విమానయాన సంస్థను స్థాపించి భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా బిరుదు పొందారు. 1946లో ఆ సంస్థ ‘ఎయిర్ ఇండియా’గా మారింది. ఆయన సేవలను గుర్తించి కేంద్రం 1992లో భారతరత్న అవార్డుతో సత్కరించింది.
Similar News
News December 12, 2024
ధరణి పోర్టల్ తాత్కాలికంగా బంద్
TG: డేటా బేస్‌లో మార్పుల కారణంగా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు డేటాబేస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఈ మధ్య కాలంలో పోర్టల్‌లో సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
News December 12, 2024
సినిమా షూటింగ్‌లో గాయపడ్డ అక్షయ్ కుమార్!
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్-5’ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ స్టంట్ చేస్తున్న సమయంలో ఒక వస్తువు ఆయన కంటికి తగిలినట్లు తెలిపాయి. సిబ్బంది వెంటనే నేత్ర వైద్యుడిని సెట్స్‌కి పిలిపించి చికిత్స చేయించినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారని తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది.
News December 12, 2024
గ్రేట్.. తొమ్మిది నెలల గర్భంతో భరతనాట్యం
భరతనాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు యజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే ‘మాతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని పాప కూడా తన్నడాన్ని అనుభవించినట్లు చెప్పారు. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చారు.