News January 30, 2025

జన్మత: పౌరసత్వం రద్దు బిల్లు ప్రవేశపెట్టిన సెనేటర్లు

image

అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసా హోల్డర్ల పిల్లలకు జన్మత: పౌరసత్వం నిరోధించే బిల్లును రిపబ్లికన్ సెనేటర్లు కొందరు US సెనేట్లో ప్రవేశపెట్టారు. అక్రమ వలసలు, జాతీయ భద్రత బలహీనతకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ దోపిడీయే కారణమని సెనేటర్లు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రూడ్, కేటీ బ్రిట్ అంటున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో దీనికి తెరపడుతుందన్నారు. ఇకపై నిర్దేశించిన తేదీ తర్వాత పుట్టే పిల్లలకే బర్త్‌రైట్ ఉండదు.

Similar News

News February 9, 2025

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు ఆదేశం

image

AP: తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌పై <<15400758>>ఆరోపణలు వస్తున్న<<>> వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

News February 9, 2025

థాంక్యూ మీట్‌కు హాజరుకాకపోవడంపై రష్మిక పోస్ట్

image

‘పుష్ప-2’ థాంక్యూ మీట్‌కు హాజరుకాని హీరోయిన్ రష్మిక ఆసక్తికర పోస్ట్ చేశారు. సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి తమ శ్రమతో ఇలాంటి అద్భుతాన్ని అందించినందుకు థాంక్యూ చెప్పారు. శ్రీవల్లి హృదయంలో తమకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు, గుర్తుండిపోయే రోల్ ఇచ్చినందుకు మరోసారి థాంక్యూ అని రాసుకొచ్చారు.

News February 9, 2025

చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

error: Content is protected !!