News March 23, 2024
బర్త్ డే స్పెషల్.. ‘గేమ్ ఛేంజర్’ టీమ్ సర్‌ప్రైజ్ ప్లాన్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోజు గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ అనే పాట ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Similar News
News April 17, 2026
ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.
News April 17, 2026
సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ఆలస్యం కానుంది. సా.4 గంటలకే ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా 6PMకు ఆ బిల్లులపై ప్రసంగించనున్నారు. షా స్పీచ్ తర్వాత ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News April 17, 2026
20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.


