News June 20, 2024

పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. ఆల్ఫా హోటల్‌పై కేసు

image

TG: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరి ఆల్ఫా హోటల్‌లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఫుడ్ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో తేలింది. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండి ఫ్రిజ్‌లో పెడుతున్నారని, కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నారని అధికారులు తెలిపారు. కిచెన్‌లో దారుణమైన వాసన వస్తోందని, నాణ్యతాప్రమాణాలు ఏమాత్రం లేవని వెల్లడించారు. కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 17, 2024

ప్రశాంతంగా కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనం: మంత్రి పొన్నం

image

TG: రాష్ట్రంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రేపు వర్కింగ్ డే కావడంతో ఆలస్యం కాకుండా త్వరగా నిమజ్జనం చేయాలని నిర్వాహకులను కోరారు. హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి గణేశులు తరలివస్తుండడంతో ట్యాంక్‌బండ్‌పై జనసందోహం నెలకొంది. నగరంలో ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి.

News September 17, 2024

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అల్లు అర్జున్ భరోసా?

image

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అండగా నిలిచేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలికి తాను నటించే, గీతా ఆర్ట్స్ నిర్మించే అన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని ప్రకటించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఇప్పటికే ‘పుష్ప-2’లోనూ పని చేస్తున్నారని టాక్. తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలని ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్‌లో బన్నీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

News September 17, 2024

మహేశ్-రాజమౌళి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి SSMB29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరలవుతోంది. ఇందులో స్టోరీ-విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ-P.S. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.