News December 24, 2024
BITCOIN: $91000 వద్ద కీలక సపోర్ట్

క్రిప్టో మార్కెట్లో స్తబ్ధత నెలకొంది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జీవితకాల గరిష్ఠం నుంచి 13% పతనమైన బిట్‌కాయిన్ ప్రస్తుతం $94,200 స్థాయిలో చలిస్తోంది. గత 24 గంటల్లో 0.37% మేర తగ్గింది. $91000 వద్ద సపోర్టు లభించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 3.66% లాభపడి $3387 వద్ద కొనసాగుతోంది. XRP, BNB, SOL, DOGE, ADA, TRX, AVAX, LINK, TON, SHIB 4-6% మేర ఎగిశాయి.
Similar News
News September 14, 2025
జూరాల ప్రాజెక్టుకు 9 గేట్లు ఎత్తివేత

ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టుకు 1 లక్ష క్యూసెక్కులు వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9 స్పిల్ వే గేట్లు ఓపెన్ చేసి 62,406 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 38,271, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 1,01,272 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.
News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
News September 14, 2025
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు