News December 24, 2024

BITCOIN: $91000 వద్ద కీలక సపోర్ట్

image

క్రిప్టో మార్కెట్లో స్తబ్ధత నెలకొంది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జీవితకాల గరిష్ఠం నుంచి 13% పతనమైన బిట్‌కాయిన్ ప్రస్తుతం $94,200 స్థాయిలో చలిస్తోంది. గత 24 గంటల్లో 0.37% మేర తగ్గింది. $91000 వద్ద సపోర్టు లభించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 3.66% లాభపడి $3387 వద్ద కొనసాగుతోంది. XRP, BNB, SOL, DOGE, ADA, TRX, AVAX, LINK, TON, SHIB 4-6% మేర ఎగిశాయి.

Similar News

News January 22, 2025

CID మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు

image

AP: CID మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ట్యాబ్‌ల కొనుగోళ్లు, అగ్ని మొబైల్ యాప్‌ను జేబు సంస్థలకు కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి. నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణా రాహిత్యంపై నెల లోపు వివరణ ఇవ్వాలని CS విజయానంద్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

News January 22, 2025

వింటర్‌లో వీటిని తినడం లేదా..?

image

చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలు కచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో నారింజ, నిమ్మకాయ రసం తాగాలి. అలాగే చిలగడ దుంపలు, సలాడ్లు, చియా సీడ్స్, బాదం, జీడిపప్పు తీసుకోవాలి. ఆకుకూరలు, క్యారెట్, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తినాలి. కొన్ని కూరగాయలు, పప్పులు, మాంసంతో చేసిన సూప్ తీసుకుంటే శరీరం వెచ్చబడుతుంది. పాలకూర, బచ్చలికూర తీసుకుంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.

News January 22, 2025

పౌరసత్వంపై ట్రంప్ నిర్ణయం: కోర్టులో పిటిషన్

image

జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్ డిస్ట్రిక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇమ్మిగ్రెంట్స్ రైట్స్ అడ్వకేట్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. ట్రంప్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అమెరికా ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14న సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు జన్మతః పౌరసత్వం లభిస్తుందని తెలిపారు.