News November 26, 2024

ఒక్కరోజులో రూ.4లక్షలు తగ్గిన బిట్‌కాయిన్

image

బిట్‌కాయిన్ జోరు తగ్గింది. లక్ష డాలర్ల స్థాయి వద్ద గట్టి రెసిస్టెన్సీ ఎదురవ్వడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. సోమవారం ఏకంగా 5000 డాలర్లు నష్టపోయి $93035 వద్ద స్థిరపడింది. అంటే భారత కరెన్సీలో నిన్న ఒక్కరోజే రూ.4లక్షల మేర పడిపోయింది. నేడు $93,006 వద్ద ఓపెనైన BTC $94,920 వద్ద గరిష్ఠ, $94,331 వద్ద కనిష్ఠ స్థాయుల్ని అందుకుంది. ప్రస్తుతం $1300 లాభంతో 94,350 వద్ద కొనసాగుతోంది.

Similar News

News December 11, 2024

రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్

image

తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 12 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 11, 2024

గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికి‌పైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.

News December 11, 2024

విప‌క్షాల మాదిరి ప్ర‌శ్నించ‌కండి అంటూ సెటైర్లు

image

మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ విపక్ష రాజకీయ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. Dec 15న జరగనున్న సొసైటీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే, ఓడిపోయిన వారు విపక్షాల మాదిరి ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తవద్దని సూచించడం వైరల్‌గా మారింది. పోలింగ్‌పై భరోసా ఉంచాలని కోరింది. మూడేళ్లపాటు సొసైటీ బాధ్యతల్ని పర్యవేక్షించే కమిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమని పేర్కొంది.