News November 11, 2024

టైగ‌ర్ ఆఫ్ కోల్హాన్‌ను న‌మ్ముకున్న బీజేపీ

image

ఝార్ఖండ్‌లో 1st ఫేజ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని BJP ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. కోల్హాన్ ప్రాంతంలో తిరిగి ప‌ట్టు కోసం టైగ‌ర్ ఆఫ్ కోల్హాన్‌గా ప్ర‌సిద్ధికెక్కిన EX CM చంపై సోరెన్‌పై ఆశలు పెట్టుకుంది. Nov 13న 43 స్థానాల‌కు జ‌రుగుతున్న 1st ఫేజ్ ఎన్నిక‌ల్లో 20 ST, 6 SC స్థానాలున్నాయి. ఇక్కడ గెలుపు కోసం బంగ్లా నుంచి జరిగే అక్ర‌మ చొర‌బాట్ల‌కు ఆదివాసీల స‌మ‌స్య‌ల్ని ముడిపెట్టి వ్యూహాత్మక రాజ‌కీయం చేస్తోంది.

Similar News

News December 11, 2024

STOCK MARKETS: భారీ నష్టాలు తప్పవా..

image

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వొచ్చు. నిన్న US, EU సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. గిఫ్ట్ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,678 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిఫ్టీ నిరోధం 24,678, మద్దతు 24,510 వద్ద ఉన్నాయి. STOCKS TO WATCH: ఆఫిస్ స్పేస్, IOB, HG INFRA, LTIM, SAAKSHI MEDTECH, ASIAN PAINTS, MOREPEN LAB, NTPC GREEN.

News December 11, 2024

త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు

image

AP: ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు రాష్ట్రంలో ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వగా 12 స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.15లక్షలు కాగా, లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్లకు లైసెన్సులిస్తారు. కనీసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

News December 11, 2024

మార్చి 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్!

image

AP: వచ్చే ఏడాది మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి లభించగానే పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.