News March 30, 2024

బీజేపీ అభ్యర్థికి వంట చేయడమే తెలుసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

image

కర్ణాటకలో దావణగెరె బీజేపీ ఎంపీ అభ్యర్థి గాయత్రీ సిద్దేశ్వర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసని, ఇక్కడ సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారనే విషయం ఆ ముసలాడికి తెలియదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ స్థానంలో ఎమ్మెల్యే కోడలు ప్రభా మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు.

Similar News

News September 18, 2025

పాక్-సౌదీ మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం

image

పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు వ్యూహాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం చెప్పినట్లు డాన్ న్యూస్ పేపర్ పేర్కొంది. డిఫెన్స్ సపోర్ట్‌ను మెరుగు పరచుకోవడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందని ఆ దేశాలు ఆకాంక్షించాయి.

News September 18, 2025

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

image

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

News September 18, 2025

అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

image

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.