News March 30, 2024
బీజేపీ అభ్యర్థికి వంట చేయడమే తెలుసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

కర్ణాటకలో దావణగెరె బీజేపీ ఎంపీ అభ్యర్థి గాయత్రీ సిద్దేశ్వర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసని, ఇక్కడ సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారనే విషయం ఆ ముసలాడికి తెలియదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ స్థానంలో ఎమ్మెల్యే కోడలు ప్రభా మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు.
Similar News
News April 19, 2026
విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

ఇన్‌కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
News April 19, 2026
ఖమేనీ ఖననంపై నో క్లారిటీ?

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ <<19268847>>హతమై<<>> దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదు. యుద్ధం, భద్రత సహా నిర్వహణలో సవాళ్లే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వ లాంఛనాలతో భారీ ఊరేగింపు మధ్య నిర్వహించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో అంత్యక్రియలను వాయిదా వేస్తోంది. కాగా ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
News April 19, 2026
KKRతో మ్యాచ్.. RR బ్యాటింగ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన RR కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
RR: జైస్వాల్, వైభవ్, జురెల్, పరాగ్, హెట్మెయర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, రవి బిష్ణోయ్
KKR: సీఫెర్ట్, రహానే, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, నరైన్, రమణ్‌దీప్, అనుకుల్, వైభవ్ అరోరా, కార్తీక్, వరుణ్


