News April 1, 2024

రాహుల్ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వ్యాఖ్యలపై ఈసీకి BJP ఫిర్యాదు

image

లోక్‌సభ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ‘ఎన్నికల సంఘంలో కేంద్రం తమ మనుషుల్ని మోహరించిందని రాహుల్ అన్నారు. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోలేదని మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారని ఆరోపించారు’ అని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Similar News

News March 28, 2026

రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త

image

ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైస్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం FCI వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండటంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. వాటిని ఖాళీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 28, 2026

విశాఖ పోర్టుకు భారీ LPG నౌక

image

విశాఖపట్నం పోర్టుకు BW Birch అనే భారీ LPG నౌక చేరుకుంది. సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సామర్థ్యంతో వచ్చిన ఈ నౌక ప్రస్తుతం అన్‌లోడింగ్ ప్రక్రియలో ఉంది. స్థానిక ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ సరకు అత్యంత కీలకం కానుంది. పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో గ్యాస్‌ను సేఫ్‌గా నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశంలోని ప్రధాన ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రాల ద్వారా ఈ భారీ నౌక విశాఖకు చేరుకోవడం విశేషం.

News March 28, 2026

ఏ వయసు వారు ఎంత సేపు నడవాలి?

image

ఫిట్‌గా ఉండటానికి నడక ఒక ఈజీ మార్గం. వయసును బట్టి ఎంత సేపు నడవాలో డాక్టర్లు చెప్పారు. 5-12 ఏళ్ల పిల్లలు రోజుకు 60 నిమిషాలు, టీనేజర్లు 45-60 నిమిషాలు నడవాలి. 20-40 ఏళ్ల వారు 30-45 నిమిషాలు, మిడిల్ ఏజ్ వారు 30-40 నిమిషాలు వాకింగ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. 60 దాటిన వారు రోజుకు 20-30 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇలా రెగ్యులర్‌గా నడిస్తే బాడీతో పాటు బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది.