News May 25, 2024
ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామా: శశిథరూర్

పాక్ ఆక్రమిత కశ్మీర్పై పదేళ్లలో BJP ఏం చేసిందని కాంగ్రెస్ MP శశిథరూర్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల్ని మోదీ విస్మరిస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం భావోద్వేగపరమైన విషయాలను లేవనెత్తడం సరికాదని విమర్శించారు.
Similar News
News December 1, 2025
యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT
News December 1, 2025
తెలంగాణ అప్డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.
News December 1, 2025
హైదరాబాద్లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <


