News August 9, 2024
‘రెడ్డి-బీసీ’ ఫ్యాక్టర్‌పై బీజేపీ దృష్టి?

TG: రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో బీజేపీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించిన హైకమాండ్, అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల, అరవింద్ ముందువరసలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 1, 2026
పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
News January 1, 2026
హరిహరులను కొలిచేందుకు నేడే సరైన సమయం

నేడు హరిహరులను కలిపి పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈరోజు త్రయోదశి తిథి. ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒకే రోజున అటు హరి, ఇటు హర.. ఇద్దరినీ పూజించే అరుదైన అవకాశం కలిగింది. భక్తులు ఈ శుభదినాన విష్ణు సహస్రనామ పారాయణతో పాటు శివాభిషేకం చేయడం అభీష్ట సిద్ధి పొందుతారు’ అని అంటున్నారు.
News January 1, 2026
జోగి రమేశ్‌కు రూ.కోటి ముడుపులు?

AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులపై సప్లిమెంటరీ-2 ఛార్జ్‌షీటును సిట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ₹కోటికిపైగా ముడుపులు రమేశ్‌కు ఇచ్చారని సిట్ పేర్కొన్నట్లు తెలిసింది. 2021-23 మధ్య పలు విడతల్లో ఇచ్చారని సమాచారం. అద్దేపల్లి సోదరులు, రమేశ్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో 17 మంది నిందితులకు విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.


