News August 9, 2024
‘రెడ్డి-బీసీ’ ఫ్యాక్టర్‌పై బీజేపీ దృష్టి?

TG: రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో బీజేపీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించిన హైకమాండ్, అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల, అరవింద్ ముందువరసలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 17, 2026
20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.
News April 17, 2026
‘దుష్టచతుష్టయం’ అంటే ఎవరు?

ఎవరైనా నలుగురు కలిసి తప్పుడు కార్యాలు చేస్తున్నప్పుడు వారిని ‘దుష్టచతుష్టయం’తో పోలుస్తాం. రాజకీయాల్లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. మహాభారతంలోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడిని కలిపి దుష్టచతుష్టయం అని మహా కవి తిక్కన ఉద్యోగ పర్వంలో సంబోధించారు. ‘మాయా బజార్’ సినిమా ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ జీవితంలో ఇలా దుష్టచతుష్టయం ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 17, 2026
బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.


