News February 8, 2025
32 ఏళ్ల తర్వాత ఢిల్లీలో BJPకి 47% ఓటుషేర్

ఢిల్లీ ఎన్నికల్లో BJP విజయానికి పెరిగిన ఓటు షేరే కారణం. 32 ఏళ్ల తర్వాత ఆ పార్టీ 47% ఓటుషేర్ సాధించింది. 1993లో 47.82% ఓట్లు పొందిన కాషాయ దళం మళ్లీ 2025లో 47% సాధించడం గమనార్హం. 1998లో 34.02, 2003లో 35.22, 2008లో 36.34, 2013లో 33.00, 2015లో 32.30, 2020లో 38.51 శాతంతోనే సరిపెట్టుకుంది. చివరి రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువే పొందినా అసెంబ్లీలో అందుకోకపోవడంతో ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా మారింది.
Similar News
News October 13, 2025
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు 10 మంది మినిస్టర్లతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, DSBV స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవి కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
News October 13, 2025
టాటా మెమోరియల్ సెంటర్లో 78 ఉద్యోగాలు

టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (పంజాబ్)లో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ, అంకాలజీ నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. https://tmc.gov.in/
News October 13, 2025
గొడవైందా? మరి ఆ తర్వాత..

గొడవల్లేకుండా ఏ బంధం ఉండదు. ముఖ్యంగా దంపతుల మధ్య కలహాలు సాధారణం. అయితే వీటి వల్లే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం, ఆ బంధం స్ట్రాంగ్‌గా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గొడవైన తర్వాత భాగస్వామి వెంటనే సారీ చెప్పాలని ఆశించకండి. వారికి ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. ఒకరినొకరు నిందించుకోకూడదు. అలాగే గొడవ ఎందుకు జరిగింది, ఆ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు అన్నవి కూడా చర్చించుకోవాలి.