News February 8, 2025
32 ఏళ్ల తర్వాత ఢిల్లీలో BJPకి 47% ఓటుషేర్

ఢిల్లీ ఎన్నికల్లో BJP విజయానికి పెరిగిన ఓటు షేరే కారణం. 32 ఏళ్ల తర్వాత ఆ పార్టీ 47% ఓటుషేర్ సాధించింది. 1993లో 47.82% ఓట్లు పొందిన కాషాయ దళం మళ్లీ 2025లో 47% సాధించడం గమనార్హం. 1998లో 34.02, 2003లో 35.22, 2008లో 36.34, 2013లో 33.00, 2015లో 32.30, 2020లో 38.51 శాతంతోనే సరిపెట్టుకుంది. చివరి రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువే పొందినా అసెంబ్లీలో అందుకోకపోవడంతో ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా మారింది.
Similar News
News March 18, 2025
IPL-2025: తక్కువ జీతమున్న కెప్టెన్ ఇతడే!

మరికొన్ని రోజుల్లో IPL-2025 మొదలుకానుండగా కెప్టెన్ల జీతాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా LSG కెప్టెన్ పంత్ రూ.27 కోట్లు జీతం పొందనున్నారు. అలాగే అత్యల్పంగా KKR కెప్టెన్ రహానె రూ.1.5 కోట్లు తీసుకోనున్నారు. పంత్ తర్వాత అయ్యర్(PBKS) రూ.26.75Cr, గైక్వాడ్ (CSK) ₹18 Cr, సంజూ(RR) ₹18Cr, కమిన్స్(SRH) ₹18Cr, అక్షర్(DC) ₹16.50 Cr, గిల్(GT) ₹16.50Cr, పాండ్య(MI) ₹16.35Cr, రజత్(RCB) ₹11Cr.
News March 18, 2025
అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
News March 18, 2025
ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?