News June 4, 2024
కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం
కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముందంజలో ఉన్నారు.
Similar News
News November 5, 2024
గంభీర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్
తన పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రిప్లై ఇచ్చారు. ‘ఈయనే 25 ఏళ్ల వ్యక్తి. ప్రతి ఏటా మీ శక్తి, తేజస్సు మరింత పెరుగుతూ వస్తోంది. మీరు ఎప్పటికీ ప్రేమను పంచుతూ ఉండండి’ అని గంభీర్ ట్వీట్ చేశారు. దీనికి షారుఖ్ స్పందిస్తూ ‘నాకు 25 ఏళ్లా? నేనింకా చిన్నవాడిని అనుకున్నానే. హ హ. స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు థాంక్స్. మీరెప్పటికీ నా కెప్టెనే’ అని రిప్లై ఇచ్చారు.
News November 5, 2024
నా వ్యాఖ్యలు బాధపెడితే క్షమించండి: కస్తూరి
తాను చేసిన <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళ నటి కస్తూరి ప్రకటన విడుదల చేశారు. ‘రెండ్రోజులుగా నాకు బెదిరింపులు వస్తున్నాయి. నేను నిజమైన జాతీయవాదిని. కుల, ప్రాంతీయ భేదాలకు నేను అతీతం. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను మాట్లాడింది నిర్దిష్ట వ్యక్తుల గురించి మాత్రమే. ఎవరినైనా బాధపెడితే క్షమించండి. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
News November 5, 2024
అక్టోబర్ మాసం: దేశంలో 4లక్షల కార్ల విక్రయం
అక్టోబర్‌లో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా, దీపావళి పండుగలు ఉండటంతో ప్రజలు భారీగా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేశారు. ఒక్క నెలలోనే దేశంలో 4,01,447 కార్ల అమ్మకం జరిగింది. వీటిలో మారుతీ సుజుకి అధికంగా 1,59,591 కార్లను విక్రయించింది. వీటి తర్వాత హుండాయ్(55,568), మహీంద్రా (54,504), టాటా మోటార్స్ (48,131), టయోటా (30,845), కియా మోటార్స్(28,545) ఉన్నాయి.