News September 21, 2024
బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: రాహుల్
అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై BJP అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. సిక్కులు, ఇతర మతాలపై చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయంలో BJP తన నోరునొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ‘సిక్కులు తలపాగా, కడియం ధరించవచ్చా? వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా? అనే వాటిపైనే దేశంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని మతాలదీ ఇదే పరిస్థితి’ అని గతంలో రాహుల్ అన్నారు.
Similar News
News October 10, 2024
ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉ.10.30 గంటలకు NCPA గ్రౌండ్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
News October 10, 2024
Ratan Tata: చాలామంది స్టార్టప్ ఓనర్లకు మెంటార్ కూడా..
రతన్ టాటా ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్ మాత్రమే కాదు. ఎందరో యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు ఆయన మెంటార్. 2014లో తొలిసారి స్నాప్‌డీల్‌లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత Ola, Upstox, Lenskart, CarDekho, FirstCry, Paytm, Bluestone వంటి 50+ న్యూఏజ్ స్టార్టప్పుల్లో ఇన్వెస్ట్ చేశారు. వ్యాపారంలో రాణించేందుకు ఆ ఓనర్లకు బిజినెస్ పాఠాలు చెప్పారు. డిసిషన్ మేకింగ్, స్ట్రాటజీస్ రూపకల్పనపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
News October 10, 2024
నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం
AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.