News October 7, 2024
ఝార్ఖండ్ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం కీలక నేతల సమావేశం జరిగింది. 28 గిరిజన స్థానాల్లో మిత్రపక్షాలు కాకుండా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ ద్వారా ఆ వర్గాలు BJPకి చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షాలు AJSUకు 9, JDUకు 2 స్థానాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Similar News
News December 11, 2025
సంగారెడ్డి: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రావీణ్య

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడటంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తాళ్లపల్లి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
News December 11, 2025
చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.
News December 11, 2025
ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామాల అధిపతులెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
-కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్‌లో


