News January 17, 2025
BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Similar News
News February 11, 2025
GBS కేసులపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
News February 11, 2025
మంచి మాట – పద్యబాట

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు బడ బడ వాగుతూ ఉంటాడు.
News February 11, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అయితే వెబ్‌సైట్‌లో ఎర్రర్ వస్తోందని, రిజల్ట్స్ చూపించడం లేదని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 22 నుంచి 29 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ <