News February 6, 2025
మా అభ్యర్థులకు బీజేపీ రూ.15 కోట్లు ఆఫర్ చేసింది: ఆప్ నేత

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏడుగురు ఆప్ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ ముగియగానే బీజేపీ నుంచి సదరు అభ్యర్థులకు కాల్స్ వచ్చాయని, ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. కానీ ఆప్ అభ్యర్థులు ఆ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు.
Similar News
News March 25, 2025
న్యూజిలాండ్‌లో భూకంపం

న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 7.13 గంటలకు పశ్చిమ తీరంలోని సౌత్ ఐలాండ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది.
News March 25, 2025
ALERT: వడగాలులు.. వర్షాలు!

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా, మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకూ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు.
News March 25, 2025
ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్: కేంద్రమంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవటంతో పాటు సులభంగా అప్లై చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధిని 15 నెలల నుంచి 8నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటివరకు 89లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.