News November 27, 2024

కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ నిరసన కార్యక్రమాలు

image

TG: కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. అదే సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్‌లను ప్రదర్శించనుంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2వేల మందితో నిరసన సభలు ఏర్పాటు చేయనుంది.

Similar News

News December 13, 2024

రేపు కీలక ప్రకటన: మంచు విష్ణు

image

మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాను ఓ ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించారు. తాను చేసే ప్రకటన మనసుకు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో విష్ణు ఎలాంటి విషయం వెల్లడించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 13, 2024

అల్లు అర్జున్ విడుదల ఆలస్యం

image

చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాస్త ఆలస్యం కానుంది. న్యాయమూర్తి ఆదేశాల కాపీ సైట్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత వాటిని జైలర్ వెరిఫై చేసుకుని ఖైదీలను రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం తీర్పు కాపీ ప్రిపరేషన్‌లో ఉందని సమాచారం. దీంతో బన్నీ బయటకు వచ్చేందుకు మరో అరగంటకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కాగా బన్నీకి స్వాగతం పలికేందుకు జైలు బయట భారీగా ఫ్యాన్స్, ఇంటి వద్ద కుటుంబీకులు వేచి చూస్తున్నారు.

News December 13, 2024

ఈ రోజు మార్కెట్ల‌ జోష్‌కు కార‌ణం ఇదే!

image

స్టాక్ మార్కెట్లు Fri ఉద‌యం నుంచి న‌ష్టాల్లో ప‌య‌నించినా మిడ్ సెష‌న్‌లో కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో తిరిగి పుంజుకున్నాయి. దీనికి ప్ర‌ధానంగా FIIల పెట్టుబ‌డుల ప్ర‌వాహం కార‌ణంగా క‌నిపిస్తోంది. DIIలు ₹732 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. అయితే, FII/FPIలు ₹2,335 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. దీంతో కీల‌క రంగాలకు ల‌భించిన కొనుగోళ్ల మ‌ద్ద‌తు సూచీల రివ‌ర్స‌ల్‌కి కార‌ణ‌మైంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.