News January 7, 2025
ఈనెల 10న బీజేపీ నిరసనలు

TG: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు BJP ప్రకటించింది. ఆరోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలనకు బీసీలు పనికి రారని CM రేవంత్ గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
Similar News
News November 27, 2025
భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.
News November 27, 2025
అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.
News November 27, 2025
BCల రిజర్వేషన్లు తగ్గించలేదు: సీతక్క

TG: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 50% రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ‘కొన్ని మండలాల్లో SC, ST జనాభా ఎక్కువగా ఉండటంతో BC రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగింది. ఎక్కడా BCల రిజర్వేషన్లు తగ్గించలేదు. సర్పంచుల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, ZPTCలకు జిల్లాను, ZP ఛైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నాం’ అని తెలిపారు.


