News November 27, 2024

‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు

image

TG: సీఎం రేవంత్ కూల్చివేతల మనిషి(డెమోలిషన్ మ్యాన్) అంటూ తెలంగాణ BJP సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఆయన వెనుకబడిన, పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తాడని ఆరోపించింది. కాంగ్రెస్ ఉన్నతవర్గం, మిత్రపక్షం BRS, కామన్ ఫ్రెండ్ ఒవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌లను తాకబోరంటూ విమర్శలు గుప్పించింది. హైడ్రా, మూసీ కూల్చివేతలను ఉద్దేశించి ఈ పోస్టు చేసింది.

Similar News

News January 21, 2026

రైలును పట్టాలు తప్పించే కుట్ర!

image

మహారాజా ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ముప్పు తప్పింది. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర చేశారు. పట్టాలపై ఇనుప కడ్డీలను పెట్టారు. లోకో పైలట్ వెంటనే గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు. ఇనుప కడ్డీలను తొలగించి, డాగ్ స్క్వాడ్, పోలీసుల తనిఖీల తర్వాత రైలును పంపారు.

News January 21, 2026

దావోస్‌లో కేటుగాళ్లు.. బిలియనీర్లకే బురిడీ

image

దావోస్‌లో కేటుగాళ్లు మాటువేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బిలియనీర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు ‘USA హౌస్‌’లోకి వీఐపీ యాక్సెస్ కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు స్కామర్లు నకిలీ టికెట్లను విక్రయించడం గమనార్హం. ఈ విషయం బయటపడటంతో జాగ్రత్తగా ఉండాలంటూ బిలియనీర్లను USA హౌస్‌ హెచ్చరించింది. ‘మోసపోయిన వారికి మా సానుభూతి’ అంటూ పేర్కొంది.

News January 21, 2026

రెహమాన్ గొప్ప కంపోజర్, మంచి వ్యక్తి: RGV

image

‘జయహో’ పాట విషయంలో ఏఆర్ రెహమాన్‌పై తన <<18913562>>వ్యాఖ్యలను<<>> తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. తన దృష్టిలో రెహమాన్ గొప్ప కంపోజర్ అని, తాను కలిసినవారిలోకెల్లా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఇతరుల క్రెడిట్ తీసుకునేవారిలో చివర ఉండేది ఆయనేనని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఇప్పటికైనా నెగటివ్ ప్రచారానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్లు Xలో రాసుకొచ్చారు.