News November 27, 2024
‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు
TG: సీఎం రేవంత్ కూల్చివేతల మనిషి(డెమోలిషన్ మ్యాన్) అంటూ తెలంగాణ BJP సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఆయన వెనుకబడిన, పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తాడని ఆరోపించింది. కాంగ్రెస్ ఉన్నతవర్గం, మిత్రపక్షం BRS, కామన్ ఫ్రెండ్ ఒవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌లను తాకబోరంటూ విమర్శలు గుప్పించింది. హైడ్రా, మూసీ కూల్చివేతలను ఉద్దేశించి ఈ పోస్టు చేసింది.
Similar News
News December 8, 2024
TODAY HEADLINES
☛ TG: ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
☛ సంక్రాంతి తర్వాత రైతుభరోసా: సీఎం రేవంత్
☛ తెలంగాణలో(MBNR) మరోసారి భూ ప్రకంపనలు
☛ AP: పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న CM CBN, పవన్ కళ్యాణ్
☛ ఏటా DSC నిర్వహిస్తాం: CM చంద్రబాబు
☛ పవన్‌పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: విజయసాయిరెడ్డి
☛ 3 రోజుల్లోనే పుష్ప-2కి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్
☛ అడిలైడ్ టెస్ట్: రెండో ఇన్నింగ్స్‌లో IND 128/5
News December 8, 2024
రష్యా-ఉక్రెయిన్ వార్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి అవకాశాలు కనిపిస్తున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇంధన ధరల పెరుగుదల, ఆహారం, ద్రవ్యోల్బణం, ఎరువుల కొరత సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. Global Southలోని 125 దేశాల భావాలను భారత్ వినిపిస్తోందని, యూరోపియన్ నేతలు కూడా ఇరుదేశాలతో చర్చలు కొనసాగించాలని భారత్‌ను కోరారన్నారు. యుద్ధం కొనసాగింపు కంటే చర్చల వైపు పరిస్థితులు మారుతున్నట్లు చెప్పారు.
News December 8, 2024
ఒకేసారి న్యాయవాదులైన తండ్రీకూతురు
TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్ 50 ఏళ్ల వయసులో LLB కోర్సు చేశారు. ఆయన కూతురు కూడా ఇదే కోర్సు చేయడంతో తెలంగాణ బార్ కౌన్సిల్‌లో ఇవాళ ఇద్దరూ ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. శ్రీనివాస్ మెట్‌పల్లిలో ఫ్లెక్సీ షాప్ నిర్వహిస్తూ శాతవాహన యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేశారు. కావ్య ఢిల్లీలోని సెంట్రల్ వర్సిటీ నుంచి పట్టాను పొందారు.