News May 23, 2024
యూపీలో బీజేపీ అన్ని సీట్లూ కోల్పోతుంది: అఖిలేశ్

యూపీలో బీజేపీ అన్ని లోక్‌సభ సీట్లూ కోల్పోతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా 140 కోట్లమంది అంతా కలిసి ఎన్డీయేను ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘అధికార పక్షంపై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. ఏడో దశ ఎన్నికలనాటికి అది పూర్తిస్థాయికి చేరుకుంటుంది. వారణాసి సీటు ఒక్కటి తప్ప అన్నీ ఓడిపోతారని గతంలో చెప్పాను కానీ ఇప్పుడు ఆ ఒక్కటీ కష్టమేనేమో’ అని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
నల్గొండ జిల్లా జడ్జిగా వసంత్ పాటిల్ బాధ్యతలు

నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్ పాటిల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చూస్తానని తెలిపారు.

LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <