News December 30, 2024
GHMC ఎన్నికల్లో బీజేపీదే విజయం: ఈటల

TG: తెలంగాణలో మున్ముందు ఏర్పడేది తమ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. దేశానికి మోదీ తప్ప మరో దిక్సూచి కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుంది. బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. 140కోట్లమంది జనాభా ఉన్న భారతదేశం ప్రశాంతంగా ఉందంటే దానికి మోదీ నాయకత్వమే కారణం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.
News December 9, 2025
శాంసన్‌కు మరోసారి అన్యాయం: ఫ్యాన్స్

SAతో తొలి T20లో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సంజూకి అన్యాయం జరిగిందని, ఫామ్‌లో లేని కొందరు ప్లేయర్లకు టీమ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తోందని SMలో పోస్టులు పెడుతున్నారు. SAతో గత T20 సిరీస్‌లో శాంసన్ 2 సెంచరీలు చేశారని, గిల్ కంటే సంజూ బ్యాటింగ్ Avg, SR మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్లేయింగ్11లో ఉండేందుకు సంజూ అర్హుడని పేర్కొంటున్నారు.
News December 9, 2025
తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచి: భట్టి

తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్-2047 ఓ దిక్సూచి అని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఓ గదిలో కూర్చొని దీన్ని రూపొందించలేదని, విస్తృత సంప్రదింపులు, అనేక అభిప్రాయాల తర్వాతే దీనికి రూపు తెచ్చామని గ్లోబల్ సమ్మిట్‌లో వివరించారు. సమ్మిళిత వృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమ్మిట్‌కు విభిన్న ఆలోచనలతో వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరి సూచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు.


