News December 30, 2024

GHMC ఎన్నికల్లో బీజేపీదే విజయం: ఈటల

image

TG: తెలంగాణలో మున్ముందు ఏర్పడేది తమ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. దేశానికి మోదీ తప్ప మరో దిక్సూచి కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మా పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుంది. బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. 140కోట్లమంది జనాభా ఉన్న భారతదేశం ప్రశాంతంగా ఉందంటే దానికి మోదీ నాయకత్వమే కారణం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 24, 2025

విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి

image

TG: వేసవిలో పీక్ డిమాండ్‌ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుకు 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

News January 24, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 24, శుక్రవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 24, 2025

శుభ ముహూర్తం (24-01-2025)

image

✒ తిథి: బహుళ దశమి తె.4.53 వరకు ✒ నక్షత్రం: అనురాధ తె.3.07 వరకు ✒ శుభ సమయములు: సా.4.32 నుంచి 5.20 వరకు ✒ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ✒ యమగండం: ఉ.3.00-4.30 వరకు ✒ దుర్ముహూర్తం: 1) ఉ.8.24-9.12 వరకు 2) సా.6.16-8.00 వరకు ✒ వర్జ్యం: ఉ.7.52-9.36 వరకు ✒ అమృత ఘడియలు: సా.6.16-8.00 వరకు