News June 4, 2024

కర్ణాటకలో బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం

image

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. జేడీ(ఎస్) 2 చోట్ల గెలుపొందింది. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. అటు తమిళనాడులో కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఎం ఒక చోట గెలిచి, మరో స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. డీఎంకే 22, VCK 2, సీపీఐ 2 చోట్ల గెలవగా, MDMK, IUML తలో చోట ఆధిక్యంలో ఉన్నాయి.

Similar News

News November 30, 2024

బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య బీమా?

image

APలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందుతోంది. వీరికి ఆరోగ్య బీమా పథకాన్ని(EHS) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కోసం ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఉద్యోగి దాదాపు ₹7వేలు చెల్లిస్తున్నారు. అయితే రెండు జాతీయ బ్యాంకుల ప్రీమియం ₹2,500 మాత్రమే ఉంది. దీంతో ఈ విధానం అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

News November 30, 2024

GOOD NEWS.. రూ.2 లక్షల రుణమాఫీ!

image

రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు శుభవార్త. నేడు పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో CM రేవంత్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3వేల కోట్లు విడుదల చేయనుంది. DEC మొదటి వారంలో జీతాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ కాగా.. పలు కారణాలతో 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదు.

News November 30, 2024

ప్రత్యర్థులు మిస్ అవ్వరు అనుకుంటున్నా: KTR

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని రోజులు హైదరాబాద్‌ను వీడనున్నారు. కొంత కాలం వెల్‌నెస్ రీట్రీట్‌కు వెళ్లనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘నేను తిరిగి వచ్చేవరకూ నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మిస్ అవ్వరు అనుకుంటున్నా’ అని సెటైర్లు వేశారు.