News June 4, 2024

కర్ణాటకలో బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం

image

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. జేడీ(ఎస్) 2 చోట్ల గెలుపొందింది. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. అటు తమిళనాడులో కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఎం ఒక చోట గెలిచి, మరో స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. డీఎంకే 22, VCK 2, సీపీఐ 2 చోట్ల గెలవగా, MDMK, IUML తలో చోట ఆధిక్యంలో ఉన్నాయి.

Similar News

News November 2, 2024

తిరుమలను వక్ఫ్ బోర్డుతో ఎలా పోలుస్తారు?: విష్ణువర్ధన్ రెడ్డి

image

MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<14510629>>వ్యాఖ్యలపై<<>> AP BJP నేత విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ‘మీరు హిందువుల అత్యంత పవిత్రమైన స్థలాన్ని కొన్ని కమ్యూనిటీ సెంటర్ల(వక్ఫ్ బోర్డు)తో పోల్చుతున్నారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో హిందువులు అడుగు పెట్టలేరు. మరి మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా? మీరు నిజంగా బాలాజీని విశ్వసిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.

News November 2, 2024

సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు.. గ్యాంగ్‌స్టర్ తమ్ముడి కోసం వెతుకులాట

image

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ సోద‌రుడు అన్మోల్‌ను అమెరికా నుంచి రప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అన్మోల్‌పై Maharashtra Control of Organised Crime Act (MCOCA) ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అత‌నిపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీచేశారు. ఎక్స్‌ట్రాడిషన్‌ కోసం కోర్టు ప‌త్రాల‌ను ముంబై పోలీసులు కేంద్రానికి పంపనున్నారు.

News November 2, 2024

ఈ యాప్ SBIది కాదు.. నమ్మకండి: PIB

image

నెట్ బ్యాంకింగ్ ద్వారా పొందిన రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకునేందుకు ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని SBI పంపినట్లుగా APK ఫైల్‌తో కూడిన మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇవాళే ఇన్‌స్టాల్ చేస్తే రూ.9,980 పొందొచ్చని మెసేజ్ సారాంశం. అయితే దీనికి SBIకి సంబంధం లేదని PIB ఫ్యాక్ట్‌చెక్ పేర్కొంది. ఇలాంటివి SBI పంపించదని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని అవగాహన కల్పించింది. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?