News February 8, 2025
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738985103181_782-normal-WIFI.webp)
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Similar News
News February 8, 2025
అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995282894_782-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్‌పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.
News February 8, 2025
1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995458923_1199-normal-WIFI.webp)
న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీలో సీఎం ఆతిశీ మార్గేనా 3231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ 45, ఆప్ 25 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
News February 8, 2025
సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738405851345_81-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.