News February 8, 2025

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ

image

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

Similar News

News March 21, 2025

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండి తెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు. కాగా ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.

News March 21, 2025

బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు: కిషన్ రెడ్డి

image

బొగ్గు ఉత్పత్తిలో భారత్ 1 బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పెంచాం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్‌గా భారత్ ఎదుగుతోంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News March 21, 2025

UPI పేమెంట్స్‌ సబ్సిడీ ఎత్తివేతపై ఇండస్ట్రీ ఆందోళన

image

రూపే డెబిట్ కార్డులకు GOVT సబ్సిడీ విత్‌డ్రా చేసుకోవడంపై డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది. ఏటా రూ.500-600CR మేర నష్టం తప్పదని అంచనా వేస్తోంది. FY25లో స్మాల్ మర్చంట్స్ UPI పేమెంట్స్‌‌కే కేంద్రం రూ.1500CR కేటాయించింది. గత ఏడాదీ ఇండస్ట్రీ రూ.5500 కోట్లను ఆశించగా రూ.3,681CR ఇవ్వడం గమనార్హం. జీరో MDR వల్ల రూపే కార్డులపై వచ్చే నష్టాన్ని బ్యాంకులు, Fintechsకి కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది.

error: Content is protected !!