News August 25, 2024
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కీలక భేటీ

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఎక్కడ తప్పులు జరిగాయన్నదానిపై కమిటీ చర్చించనుంది. తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేయనుంది.
Similar News
News April 5, 2026
2 వారాలు మైదా మానేస్తే?

కేవలం 2 వారాలు మైదా పక్కన పెడితే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మైదా వల్ల వచ్చే షుగర్ స్పైక్స్ తగ్గి రోజంతా ఎనర్జీ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉండదు. కాబట్టి దీన్ని మానేస్తే జీర్ణక్రియ మెరుగై గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావు. మైదాకు బదులు తృణధాన్యాలు తింటే ఆకలి త్వరగా వేయదు. వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. విటమిన్లు, మెగ్నీషియం పెరిగి చర్మం మెరుస్తుంది.
News April 5, 2026
ఉప్పల్‌లో SRHకు అదిరిపోయే రికార్డులు!

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో SRH తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.
News April 5, 2026
IPL హీట్: టాలీవుడ్ కలెక్షన్లకు గండి!

IPL మ్యాచ్‌లు ఉండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ వంటి సినిమాలకు మ్యాచ్‌ల సెగ తగులుతోంది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాలకు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే నెలాఖరు వరకు IPL సందడి కొనసాగనుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఈ ‘క్రికెట్ తుఫాను’ను తట్టుకోవడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


