News August 25, 2024
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కీలక భేటీ
హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఎక్కడ తప్పులు జరిగాయన్నదానిపై కమిటీ చర్చించనుంది. తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేయనుంది.
Similar News
News September 10, 2024
ALERT: దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్!
కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. APK ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి APKఫైల్స్‌ను అస్సలు ఓపెన్ చేయకండి. SHARE IT
News September 10, 2024
‘క్యాన్సర్ భయం’ గుప్పిట్లో 60శాతానికి పైగా భారతీయులు
భారత్‌లో 60శాతానికి పైగా ప్రజలు క్యాన్సర్‌పై భయంతో బతుకుతున్నారని GOQii నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. తమకెక్కడ క్యాన్సర్ వస్తుందోనన్న టెన్షన్ 60శాతం భారతీయుల్లో కనిపిస్తోంది. చికిత్స ఉండదేమోనన్న ఆందోళన, మరణం-ఆర్థిక కష్టాల భయాలు వారిని వెంటాడుతున్నాయి. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు దానిపై ఉన్న భయాందోళనల్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడింది.
News September 10, 2024
పెరిగిన డిమాండ్.. బంగారం, వెండి ధరలకు రెక్కలు
గోల్డ్, సిల్వర్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. జువెల్లర్స్ కొనుగోళ్లు చేపట్టడమే ఇందుకు కారణం. 99.9% స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.74,100గా ఉంది. కిలో వెండి ధర రూ.700 ఎగిసి రూ.84,500 వద్దకు చేరింది. క్రితం సెషన్లో రూ.73,350 వద్ద ముగిసిన 99.5% ప్యూర్ గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,750గా ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోతను బట్టి మున్ముందు ధరల్లో మార్పు రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.