News June 14, 2024

బీజేపీకి కొత్త చీఫ్‌.. మహిళనే నియమిస్తారా?

image

తమ పార్టీకి తొలిసారి ఓ మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమించుకోవాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మాజీ మంత్రి స్మృతి ఇరానీని అధ్యక్షురాలిగా నియమించేందుకు అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వసుంధర రాజే సింథియా, దగ్గుబాటి పురందీశ్వరి పేర్లను కూడా పరిశీలిస్తుందట. కాగా బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టకపోవడం గమనార్హం.

Similar News

News September 9, 2024

ఒకే కుటుంబంలో నలుగురికి పాము కాటు.. ముగ్గురి మృతి

image

ఒడిశాలోని బౌధ్ జిల్లాలో విషాదం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురిని పాము కాటేసింది. చరియపాలీ గ్రామానికి చెందిన ఓ తండ్రి, ముగ్గురు కూతుళ్లు ఆదివారం రాత్రి పాముకాటుకు గురయ్యారు. ఈక్రమంలో చిన్నారులు ముగ్గురూ(12, 9, 3 ఏళ్లు) కన్నుమూశారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు వారిని ఆస్పత్రి కంటే ముందు మంత్రగాడి వద్దకు తీసుకెళ్లడం వల్లే ప్రాణాలు పోయాయని స్థానికులు చెబుతున్నారు.

News September 9, 2024

సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

AP: 2014-19 మధ్య CM చంద్రబాబు పర్సనల్ సెకట్రరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో పెండ్యాలదే కీలక పాత్ర అని సీఐడీ నోటీసులివ్వడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. దీంతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

News September 9, 2024

సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

image

TG: రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకరించాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇరుకు రహదారులతో పీక్ అవర్స్‌లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.