News June 12, 2024
ఆ విషయంలో బీజేపీ తీరు మారదు: గౌరవ్ గొగొయ్

ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ తీరు మారదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ విమర్శించారు. ఈ సారి విపక్ష కూటమికి బలం పెరగడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీడియాతో పేర్కొన్నారు. గత ఏడాది 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, ఈ సారి 230 మందిని సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 3, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్‌లు.. అప్లై చేశారా?

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/
News November 3, 2025
హైదరాబాద్‌లో వర్షం షురూ..

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 3, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.


