News June 12, 2024
ఆ విషయంలో బీజేపీ తీరు మారదు: గౌరవ్ గొగొయ్

ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ తీరు మారదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ విమర్శించారు. ఈ సారి విపక్ష కూటమికి బలం పెరగడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీడియాతో పేర్కొన్నారు. గత ఏడాది 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, ఈ సారి 230 మందిని సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు.
Similar News
News March 19, 2025
ఇంకోసారి అలా అనొద్దు.. ABDకి కోహ్లీ సూచన

ఐపీఎల్-2025కి ముందు ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఈసాల కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) నినాదాన్ని ఇకపై పబ్లిక్‌లో వాడొద్దని కోహ్లీ తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ‘వరల్డ్ కప్‌ను ఈజీగా గెలవచ్చేమో కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత సులభం కాదు. ఈ టోర్నీ చాలా కఠినతరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2011-21 మధ్య ABD ఆర్సీబీకి ఆడిన సంగతి తెలిసిందే.
News March 19, 2025
సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డు బియ్యం కూడా ఇవ్వలేదు: KTR

TG: సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని KTR విమర్శించారు. ‘మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న ప్రభుత్వం పదో తేదీ దాటినా రేషన్ బియ్యం ఇవ్వలేదు. సన్నబియ్యం కోసం చూస్తే కనీసం దొడ్డు బియ్యం కూడా రాలేదు. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసింది’ అని ట్వీట్ చేశారు. మీకు ఈనెల రేషన్ వచ్చిందా? COMMENT.
News March 19, 2025
వ్యోమగాముల తిరుగు ప్రయాణం స్ఫూర్తిదాయకం: CBN

వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా భూమిపైకి రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారి తిరుగు ప్రయాణం, టీమ్ వర్క్ ఆదర్శప్రాయమైన మానవ సంకల్పాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. దీనిని సుసాధ్యం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందించారు. వ్యోమగాముల శక్తి సామర్థ్యాలకు సెల్యూట్ చేశారు.