News August 10, 2025

బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోంది: రామ్‌చందర్ రావు

image

తెలంగాణలో బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బీజేపీకి సున్నా అని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ పనే ప్రస్తుతం సున్నా అయ్యిందని ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన సందర్భంగా రామ్‌చందర్ రావు మాట్లాడారు. ‘ఓట్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఓడిపోతారని తెలిసే ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Similar News

News August 13, 2025

అతిగా నిద్రపోతే ఈ వ్యాధులు తప్పవట!

image

అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ముప్పేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వెన్ను నొప్పి, తల నొప్పితోపాటు డిప్రెషన్‌కు కూడా గురవుతారు. రాత్రి పూట ఎక్కువగా భోజనం చేయకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవచ్చు’ అని చెబుతున్నారు.

News August 13, 2025

చంద్రబాబు, పవన్‌కు థాంక్స్: జూ.ఎన్టీఆర్

image

‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు <<17383707>>పెంచుతూ<<>> AP ప్రభుత్వం జీవో ఇవ్వడంపై హీరో జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈ జీవో ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తారక్ ట్వీట్ చేశారు.

News August 12, 2025

త్వరలో భారత్-చైనా విమాన సర్వీసులు పున:ప్రారంభం?

image

భారత్-చైనా మధ్య సర్వీసులను పున:ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు కేంద్రం సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. SCO సమ్మిట్‌లో పాల్గొనేందుకు PM మోదీ ఈనెల 31న చైనా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. కరోనా సమయం నుంచి ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య మైత్రి చిగురిస్తుండటంతో రాకపోకలు రిస్టోర్ కానున్నట్లు సమాచారం.