News August 12, 2025
త్వరలో భారత్-చైనా విమాన సర్వీసులు పున:ప్రారంభం?

భారత్-చైనా మధ్య సర్వీసులను పున:ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు కేంద్రం సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. SCO సమ్మిట్‌లో పాల్గొనేందుకు PM మోదీ ఈనెల 31న చైనా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. కరోనా సమయం నుంచి ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య మైత్రి చిగురిస్తుండటంతో రాకపోకలు రిస్టోర్ కానున్నట్లు సమాచారం.
Similar News
News April 19, 2026
ఈ ఏడాదే ₹1.85 లక్షలకు 10గ్రా బంగారం?

ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.85 లక్షలకు చేరే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, లోకల్ డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరిగాయని వెల్లడించింది. స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే మంచి లాభాలను ఇస్తోందని నివేదిక తెలిపింది.
News April 19, 2026
పవన్ త్వరగా కోలుకోవాలి.. చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష

శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం <<19685329>>పవన్ కళ్యాణ్<<>> త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేశ్ కోరారు. పవన్ ఆరోగ్యవంతుడై మళ్లీ ప్రజా సేవలో బిజీ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
News April 19, 2026
బబుల్ గమ్ మింగితే ఏమవుతుంది?

బబుల్ గమ్ మింగితే ఏళ్లపాటు అది కడుపులోనే ఉండిపోతుందనేది అపోహ మాత్రమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ‘జీర్ణం కాకపోయినా ఆహారనాళం నుంచి కడుపులోకి, అక్కడి నుంచి పేగుల్లోకి ప్రయాణించి 4-5 రోజుల్లో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఎక్కడా అతుక్కోదు. కడుపు నొప్పి, వాంతుల లాంటి సమస్యలూ రావు. పొరపాటున మింగితే కంగారు పడాల్సిన పనిలేదు. అలా అని కావాలని మింగొద్దు’ అని డాక్టర్లు చెబుతున్నారు.


