News August 28, 2024

BRS భుజాలపై తుపాకులు పెట్టి BJPvsకాంగ్రెస్ ఫైట్!

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో MLC కవిత బెయిల్‌పై బయటికి రావడాన్ని కేంద్రంగా చేసుకొని రాష్ట్రంలోని BJP, కాంగ్రెస్ విమర్శల యుద్ధానికి దిగాయి. ఇదే సమయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా BRSను సైతం మరింత డ్యామేజ్ చేయాలని చూస్తున్నాయి. BJP, BRS ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అంటుంటే, కాంగ్రెస్ మద్దతుతోనే బెయిల్ వచ్చిందని BJP అంటోంది. BRS మాత్రం తాము ఎవరికీ తలవంచలేదని చెబుతోంది. దీనిపై మీ అభిప్రాయం?

Similar News

News April 19, 2026

రేపు సీఎం vs మాజీ సీఎం

image

TG: చాలా రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. రేపు CM, మాజీ CM బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ భూపాలపల్లి (D) కాటారంలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అటు జీవన్ రెడ్డి BRSలో చేరిక సందర్భంగా జగిత్యాల సభకు KCR హాజరుకానున్నారు. ఆయన అధికార పార్టీపై ఎలాంటి విమర్శనాస్త్రాలతో వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

News April 19, 2026

మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

image

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్‌లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.

News April 19, 2026

రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

image

కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.