News February 26, 2025
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ మళ్లీ థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మర్లో ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. కాగా, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
Similar News
News November 1, 2025
నేటి నుంచి చెస్ వరల్డ్ కప్

గోవా వేదికగా నేటి నుంచి ఈనెల 27 వరకు FIDE చెస్ వరల్డ్ కప్ జరగనుంది. వివిధ దేశాల నుంచి మొత్తం 206 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. చివరగా 2002లో భారత్ WCని హోస్ట్ చేసినప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఛాంపియన్గా నిలిచారు. ఆయనను గౌరవిస్తూ ఈ ఏడాది WCకి ఆనంద్ ట్రోఫీ అని పేరు పెట్టారు. IND నుంచి ప్రజ్ఞానంద, అర్జున్, గుకేశ్ తదితర ప్లేయర్లు పాల్గొననుండగా, కార్ల్సన్, కరువానా, నకమురా ఈ టోర్నీలో పాల్గొనట్లేదు.
News November 1, 2025
మన ఆచారం ప్రకారం.. చెవిలో నూనె చుక్కలు ఎందుకు వేసుకుంటారు?

దీపావళి వంటి కొన్ని పండుగలప్పుడు రెండు, మూడు నూనె చుక్కలను చెవిలో వేసుకునే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఇది చాలా శ్రేష్ఠం. ఈ కర్ణాభ్యంగం అన్ని చెవి సమస్యలతో పాటు మెడ బిగిసిపోవడం, దౌడ బిగిసిపోవడం, చెవిలో శబ్దం వంటి సమస్యలు దరిచేరనివ్వదు. ఫలితంగా చెవులకు, పాదాలకు చల్లదనం కలిగి, ఒత్తిడి తగ్గి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శ్రవణ వ్యవస్థ కోసం దీన్ని పాటించడం మంచిది.
News November 1, 2025
ప్రకాశం జిల్లాలో 16పోస్టులకు నోటిఫికేషన్

ఏపీ ప్రకాశం జిల్లాలోని శిశుగృహ, బాల సదనంలో 16 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సైకాలజీ డిప్లొమా, న్యూరో సైన్స్, LLB, పారా మెడికల్ డిప్లొమా, BSc, B.Ed, BA, B.Ed, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రకాశం జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి& సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.


