News April 26, 2024
ఓటీటీలోకి ‘బ్లాక్ బస్టర్ మూవీ’

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై గాడ్ 2’. ఈ సినిమా తెలుగు వెర్షన్ OTTలోకి వచ్చేసింది. హిందీలో గత ఏడాదే అందుబాటులోకి వచ్చినా తెలుగులో మాత్రం తాజాగా రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్ కనిపించడం గమనార్హం.
Similar News
News January 28, 2026
బాఫ్టా రేసులో మన ‘బూంగ్’.. మణిపురీ మ్యాజిక్!

ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మణిపురీ చిత్రం ‘Boong’ ప్రతిష్ఠాత్మక BAFTA 2026 నామినేషన్లలో చోటు సంపాదించింది. లక్ష్మీప్రియా దేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతోంది. మణిపుర్ నేపథ్యంతో సాగే ఓ బాలుడి కథతో తీసిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రచ్చ చేస్తోంది. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ రీజినల్ సినిమా ఇలా మెరవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News January 28, 2026
రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ శుభాకాంక్షలు

TG కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర రేపు ప్రారంభంకానుంది. ఈ జాతరను వైభవంగా జరుపుకోవాలని CM రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని US నుంచి CM ఫోన్‌లో ఉన్నతాధికారులకు సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. మరోవైపు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క-సారలమ్మను మాజీ CM KCR సైతం ప్రార్థించారు.
News January 27, 2026
ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రూ.2వేలు?

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలను అన్నదాతలకు అందించే అవకాశం ఉంది. కాగా రైతులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. లేదంటే డబ్బులు జమ కావు.


