News November 27, 2024

రేపు OTTలోకి బ్లాక్‌బస్టర్ మూవీ

image

దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ రేపు OTTలోకి రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో గత నెల 31న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Similar News

News December 11, 2024

3వ టెస్టులో ఆకాశ్ దీప్‌ను ఆడించాలి: సంజయ్ మంజ్రేకర్

image

BGT 3వ టెస్టులో హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. బ్రిస్బేన్ పిచ్ కండిషన్లు అతని బౌలింగ్ శైలికి సరిపోతాయన్నారు. 2వ టెస్టులో రాణా రన్స్ ఇచ్చారనే కారణమే కాకుండా పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందనుకుంటే ఆకాశ్‌ను ఆడించే ఆలోచన చేయాలన్నారు. అడిలైడ్ మాదిరి బ్రిస్బేన్ పిచ్ కూడా ఫ్లాట్‌గా ఉంటే బుమ్రా, సిరాజ్, రాణా లేదా ఆకాశ్ బౌలింగ్ ఎటాక్ సరిపోదని చెప్పారు.

News December 11, 2024

చలికాలంలో రోగనిరోధక శక్తికి ఇవి తినండి!

image

చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇవి దూరమవుతాయి. విటమిన్ C ఉండే ఆరెంజ్, లెమన్, నిమ్మను ఆహారంలో భాగం చేయాలి. అల్లం, వెల్లుల్లి తరచూ తీసుకోవాలి. ఈ సీజన్‌లో లభించే చిలగడదుంపలు తింటే బీటా కెరోటిన్ శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బచ్చలకూర, కాలే వంటి ఆకుకూరలు తింటే వాటిలోని విటమిన్ A,C,Kలతో రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.

News December 11, 2024

శ్రీలీలకు పెళ్లి చేసే బాధ్యత నాదే: సీనియర్ హీరో

image

అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీలపై ప్రేమను సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. ఈ బ్యూటీకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని చెప్పారు. మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని వెతికిపెడతానని తెలిపారు. అంతకుముందు తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని శ్రీలీల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.