News November 4, 2024

BLOOD BATH: స్టాక్ మార్కెట్లో పొద్దున్నే రూ.3.5లక్షల కోట్ల నష్టం

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. సెక్టోరియల్ సహా బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాలకే మొగ్గుచూపారు. నిఫ్టీ 24,073 (-230), సెన్సెక్స్ 78,996 (-740) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పొద్దున్నే రూ.3.5 లక్షల కోట్లు నష్టపోయారు. బజాజ్ ఆటో, సన్ ఫార్మా, హీరోమోటో, BPCL, RIL టాప్ లూజర్స్.

Similar News

News February 24, 2026

నేను ఎంతకాలం ఉంటానో తెలీదు.. ప్రాణహానిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

image

ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్‌లోకి చొరబడటానికి యత్నించిన ఓ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ ట్రంప్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలీదు. చాలామంది నన్ను టార్గెట్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభావవంతమైన నేతలపైనే ఇలాంటి దాడులు జరుగుతాయంటూ లింకన్, కెన్నెడీ వంటి వారిని అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.

News February 24, 2026

భాగ్యనగరంలో భారీ వర్షం.. రాబోయే కొన్ని గంటలు అలర్ట్!

image

HYDలో అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్‌బాగ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో GHMC వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండొచ్చని మ్యాప్ విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకొన్నాయి.

News February 24, 2026

మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

image

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||