News November 4, 2024
BLOOD BATH: స్టాక్ మార్కెట్లో పొద్దున్నే రూ.3.5లక్షల కోట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. సెక్టోరియల్ సహా బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాలకే మొగ్గుచూపారు. నిఫ్టీ 24,073 (-230), సెన్సెక్స్ 78,996 (-740) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పొద్దున్నే రూ.3.5 లక్షల కోట్లు నష్టపోయారు. బజాజ్ ఆటో, సన్ ఫార్మా, హీరోమోటో, BPCL, RIL టాప్ లూజర్స్.
Similar News
News December 11, 2024
పేర్ని నాని భార్య జయసుధపై కేసు
AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని ఓ గిడ్డంగి నిర్మించారు. దీనిని పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఈ గోడౌన్‌ను పోలీసులు తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
News December 11, 2024
రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా: జగన్
AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడం లేదు. సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారు. కానీ నిందలు మాపై వేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News December 11, 2024
ఇంకా జోరు తగ్గని ‘దేవర’
ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.