News December 2, 2024

రక్తదాన ఉద్యమకారిణి కాంతా క్రిషెన్ మృతి

image

భారత్‌లో స్వచ్ఛంద రక్తదానానికి విశేషంగా ప్రచారం కల్పించిన పద్మశ్రీ కాంతా క్రిషెన్(95) కన్నుమూశారు. గడచిన రెండు వారాలుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె అనారోగ్యంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. చండీగఢ్ ఆమె ప్రారంభించిన స్వచ్ఛంద రక్తదాన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆ సేవలకు గాను క్రిషెన్‌ను 1972లో కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.

Similar News

News January 21, 2026

ముంబైపై ఢిల్లీ ఘన విజయం

image

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.

News January 21, 2026

JAN 25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి వివేక్

image

TG: ఈ నెల 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్(D) నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ రాణికుముదిని ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News January 21, 2026

అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్‌ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.