News December 4, 2024

బీటెక్ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి కసరత్తు

image

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. రాష్ట్రంలో 1.16లక్షల బీటెక్ సీట్లుండగా, 70% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. వీరిలో అర్హులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. 30% యాజమాన్య కోటాలో మెరిట్, NRI పేరిట కాలేజీలు అధిక వసూళ్లు చేస్తున్నాయనే ఆరోపణలతో విద్యామండలి చర్యలకు ఉపక్రమించింది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Similar News

News December 6, 2025

బంధం బలంగా మారాలంటే?

image

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్‌ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.

News December 6, 2025

అప్పుల భారతం.. ఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?

image

దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 2025లో కుటుంబ రుణాలు ₹15.7 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2018లో సగటున ఒక్కొక్కరిపై ₹3.4 లక్షల అప్పు ఉండగా, ఇప్పుడు ₹4.8 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు EMIలు కడుతున్నారు.

News December 6, 2025

మెదడు పనితీరు మందగించకూడదంటే..

image

40 ఏళ్ల వయసు దాటితే మెదడు పనితీరు మందగిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కింది అలవాట్లతో ఆ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
*రోజు 30 నిమిషాల పాటు నడవాలి
*7-8 గంటలు నిద్రపోవాలి
*వారానికి రెండుసార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (ఎక్సర్‌సైజ్) చేయాలి
*కొత్త భాష, హాబీ, స్కిల్ లాంటివి నేర్చుకోవాలి
*బీపీ, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి
Share It